Amitabh Bachchan: హిందీ సినిమాలనే తిప్పితిప్పి సౌత్‌లో చేస్తున్నారు.. మా ఇండస్ట్రీని ఎందుకు తిట్టడం?

28 Jan, 2024 16:41 IST|Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది. స్టార్‌ కిడ్స్‌కు అందలమిస్తారని, వేరేవాళ్లను తొక్కేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో హిందీ సినిమాలను ఎవరూ చూడొద్దు, బ్యాన్‌ చేసేద్దామని నెటిజన్లు సంకల్పించుకున్నారు. ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో చాలామటుకు ఫ్లాప్స్‌గా నిలిచిపోయాయి.

అదే సమయంలో సౌత్‌ సినిమాలు అందరినీ ఆకర్షించాయి. పాన్‌ ఇండియాగా రిలీజైన చిత్రాలు జనాలను మెప్పించాయి. దీంతో బాలీవుడ్‌ పనైపోయింది. సౌత్‌ ఇండస్ట్రీదే హవా.. అన్న టాక్‌ మొదలైంది. ఇప్పటికీ చాలాచోట్ల దక్షిణాది చిత్రాలను పొగుడుతూ హిందీ సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు బాధ కలిగిస్తోందట!

సినిమాలను ఎందుకు తప్పుపడతారు?
సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ అన్న అంశంపై అమితాబ్‌ తీవ్రంగా స్పందించాడు. అలాగే సినిమాల మీద వ్యతిరేకత గురించి కూడా సంభాషించాడు. ఆయన మాట్లాడుతూ.. 'జనాల్లో వచ్చే మార్పులకు, సమాజంలో సంఘటనలకు సినిమాలే కారణమంటూ అనేకసార్లు మూవీ ఇండస్ట్రీనే తప్పుపడుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాల నుంచే కథలు, సినిమాలు పుడతాయి. ఆ యదార్థ సంఘటనలే సినిమాగా తెరకెక్కుతాయి. ఈ మధ్య ప్రాంతీయ సినిమాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.

అందుకే అద్భుతంగా కనిపిస్తున్నాయి
ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ సినిమా బాగుంది అని వాళ్లను ప్రశంసించినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? హిందీలో ఎలాంటి సినిమాలైతే తీశారో అలాంటి వాటినే అక్కడ తెరకెక్కిస్తున్నామన్నారు. దీవార్‌, శక్తి, షోలే సినిమాలను రీమేక్‌ చేస్తున్నామని, వాటి సారాన్ని వాడుకుంటున్నామన్నారు. కాకపోతే మలయాళం సినిమా అలాగే కొంతవరకు తమిళ సినిమాలు మాత్రం వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అలా అని మా ఇండస్ట్రీ కంటే అదే గొప్ప అని చెప్పడం సరి కాదు' అన్నాడు బిగ్‌బీ.

చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా!
పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌పై భార్య ఫిర్యాదు!

whatsapp channel

మరిన్ని వార్తలు