Animal Movie: యానిమల్ చిత్రాన్ని వెంటనే తొలగించండి: నెట్‌ఫ్లిక్స్‌పై ఫైర్!

28 Jan, 2024 16:45 IST|Sakshi

ఓటీటీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమా గణతంత్రం దినోత్సవం రోజునే ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. 

అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా యానిమల్ చిత్రంపై వ్యతిరేకత వస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం.

అయితే ఈ చిత్రంపై థియేటర్‌లో రిలీజ్‌ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఓటీటీలో రిలీజ్‌ కాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్స్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఓటీటీ నుంచి యానిమల్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
  
ఒక నెటిజన్ తన ట్వీట్‌లో రాస్తూ.. "నేను యానిమల్ చిత్రం చూసి కలత చెందా. ఈ సినిమా భారతీయ మహిళలను కించపరిచేలా ఉంది. ఇది భారతీయ వివాహా బంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. మన సంప్రదాయం, వారసత్వం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అన్న భావనకు భంగం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి సినిమాపై చర్యలు తీసుకోండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నయనతార నటించిన ‍అన్నపూరణి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ తొలగించిన విషయాన్ని నెటిజన్స్‌ గుర్తు చేస్తున్నారు. 

మరో నెటిజన్స్ రాస్తూ..'దయచేసి నెట్‌ఫ్లిక్స్ నుంచి యానిమల్ సినిమాని తీసేయండి. ఇది మహిళలపై ఘోరమైన హింసను ప్రతిబింబిస్తోంది. దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ అని ఎవరూ పిలవరు" అంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్‌ అయిన జావేద్ అక్తర్ యానిమల్‌ సినిమాపై పరోక్షంగా కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్‌లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు