ఆ డైరెక్టర్‌ నేను మంచి స్నేహితులం: అనసూయ

7 May, 2021 20:03 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం మూవీతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ పెంచెసుకుంది. అందులో రంగమ్మత్తగా అనసూయకు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన అనసూయను మోకాళ్లపైకి చీరకట్టుతో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన ఆమెను చూసి అందరూ షాకయ్యారు. 

అయితే రంగస్థలం షూటింగ్‌ సమయంలో తనని అందరూ రంగమ్మత్త అని పిలిచేవారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మరోసారి ఈ మూవీ షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా గురించి ఓ అసక్తికర విషయం చెప్పింది. అయితే బుచ్చిబాబు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌తో సహా అందరూ తనని రంగమమ్మత్తానే పిలిచేవారని, బుచ్చిబాబు కూడా అత్త అనే పిలిచేవాడని చెప్పింది. మూవీ సెట్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవారమని, రంగస్థలం సమయంలో బుచ్చితో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది.

‘రంగస్థలం షూటింగ్‌ నుంచి బుచ్చి, నేను మంచి స్నేహితులమయ్యాం, నా పర్సనల్‌ విషయాలు కూడా షేర్‌ చేసుకుంటుంటాను. చెప్పాలంటే ఇండస్ట్రీలో నాకంత క్లోజ్‌ అయిన వ్యక్తి కూడా ఆయనే. ఈ క్రమంలో ఉప్పెన షూటింగ్‌ ఓ సారి మా ఇంటి సమీపంలోనే జరిగింది. అప్పుడు అత్త నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నా షూటింగ్‌ జరుగుతోంది. విజయ్‌ సేతుపతి కూడా ఉన్నారు ఆయనను కలవోచ్చని రమ్మని పిలిచాడు. వెంటనే నేను షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లాను. అక్కడే విజయ్‌ సేతుపతిని కలిశాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక విజయ్‌ సేతుపతి అంటే పిజ్జా సినిమా నుంచే  ఇష్టమని, ఆ తర్వాత 96 చూశాకా.. రామ్ పాత్రలో ఆయన ఇంకా నచ్చేశాడని చెప్పింది.  అలా జరిగిన పరిచయంతోనే చెన్నైకి వెళ్లినప్పుడు కూడా ఆయనను కలిశానని అనసూయ పేర్కొంది. 

చదవండి: 
రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు