మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్లు

15 Nov, 2023 10:45 IST|Sakshi

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఇండస్ట్రీలో  మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుపై ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కొన్ని నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉంది. ఈ సమయంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పని తీరుపై ప్రకాశ్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్  మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగింది.  ఈ బిగ్‌ఫైట్‌లో మంచు విష్ణు భారీ విజయంతో మా అధ్యక్షుడి పీఠాన్ని అదరోహించారు.

ఆ తర్వాత ఆయన సినీ కార్మికులతో పాటు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న వారికి మా సభ్యత్వంతో పాటు పలు సహాయసహకారాలు అందించారు.  కానీ ఆ ఎన్నికల్లో అందరి ఎజెండాలో మా బిల్డింగ్‌ నిర్మాణం ప్రధానంగా ఉంది. త్వరలో దానిని నిర్మాస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి కూడా మా బిల్డింగ్‌ నిర్మాణం జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు గురించి ప్రకాశ్‌ రాజ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్‌,అఫ్రిది,అక్తర్‌ క్షమాపణలు)

'మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే మా కి సొంత భవనం కూడా లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా.' అంటూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పుకొచ్చారు. మా అధ్యుక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలంటూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు. అతను ఈ రెండేళ్లలో ఏమి చేశాడో చెప్పాలని కోరాడు. బోగస్ ఓట్లతో పాటు  బయట నుంచి విమానాల్లో పిలిపించుకోవడం, వంటి కార్యక్రమాలు చేయడంతో విష్ణు గెలిచాడని అన్నారు.  

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో..? చెయ్యనో..? తెలియదని చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌.. ఇక నుంచి తన దృష్టి  జాతీయ అంశాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని బిజీ షెడ్యూల్‌ వల్ల తాను మా అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు