ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఇప్పడు ఆమె ఓ స్టార్‌ యాంకర్‌

23 May, 2021 18:16 IST|Sakshi

లాక్‌డౌన్‌లో సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత, చిన్ననాటి ఫొటోలతో పాటు తమ మధుర జ్ఞాపకాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో అవి సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆక్టటుకుంటున్నాయి. ఇటీవల హీరోయిన్‌ రష్మిక మందన్నాకు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అది చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరో సెలబ్రెటీ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోలో అంత క్యూట్‌గా నవ్వుతున్న ఈ చిన్నారి ఎవరో కాదు మన స్టార్‌ యాంకర్‌, బుల్లితెర రాములమ్మ  శ్రీముఖి. కెరీర్‌ ప్రారంభంలో సినిమాల్లో హీరోలకు చెల్లెలి పాత్రలు పోషించిన శ్రీముఖి ఓ కామెడీ షోలో యాంకర్‌గా వ్యవహరించి పాపుల‌ర్‌ అయ్యింది. ఆ తర్వాత ప‌లు షోల‌కు, కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. బుల్లి తెరపై తన మాట‌లతో, గ్లామ‌ర్‌తో అలరిస్తున్న శ్రీముఖి రాముల్మగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో  బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని అభిమానులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న శ్రీముఖి చిన్న‌ప్ప‌టి పొటోపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. స్టేజ్‌పై రచ్చ రచ్చ చేసే శ్రీముఖి ఈ ఫొటోలో ఎంత కామ్‌గా ఉంది. ఆమె నవ్వు చాలా క్యూట్‌గా ఉంది అంటు నెటిజన్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు