అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ‘మెకానిక్‌’ పోస్టర్‌

29 Nov, 2023 13:51 IST|Sakshi

మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్‌’. ట్రబుల్ షూటర్... ట్యాగ్ లైన్. ముని సహేకర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మునెయ్య(మున్నా) నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్  15 న విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విడుదల చేశాడు.

కాగా, ఈ సినిమాలో  సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ పాట యూట్యూబ్‌లో 8 మిలియన్ల వ్యూస్‌ సాధించి ట్రెండిండ్‌లో ఉంది. ఇదే సినిమా నుంచి రిలీజ్‌ అయినా ‘టులెట్‌ బోర్డ్‌ ఉంది నీ ఇంటికి’అనే మరోపాట 1.6 మిలియన్స్‌తో దూసుకెళ్తోంది. ఇలా విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు  సునీత మనోహర్, సంధ్య జనక్   తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, హిందీ  భాషల్లోను  వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు