యానిమల్‌కు 'A' సర్టిఫికెట్.. ఆనందించిన సందీప్‌ రెడ్డి వంగా

29 Nov, 2023 13:18 IST|Sakshi

యానిమల్‌ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’ సినిమాను సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. విభిన్న కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 3:20 నిమిషాలు అని డైరెక్టర్‌ ప్రకటించడంతో అందరూ చూడటం కష్టం అంటూ కామెంట్లు చేశారు. తీరా ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్‌ భారీగా జరిగిపోయాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్ర‌వారం ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమాలివే!)

యానిమల్ మూవీకి సెన్సార్‌ వాళ్లు 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయంలో చాలా  సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనడం గమనార్హం. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని ఆయన క్లియర్‌గా చెప్పాడు. డిసెంబర్ 1న వచ్చే ఈ సినిమాకు పిల్లలతో వెళ్లకండని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.  నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని సందీప్‌ బహిరంగంగా చెప్పడం విశేషం. చిన్నపిల్లలకు యానిమల్‌ సినిమా సెట్‌ కాదని .. తన కుమారుడితో పాటు కజిన్స్‌ పిల్లలను కూడా ఈ సినిమాకు తీసుకుపోనని ఆయన చెప్పాడు.

అవకాశం ఉంటే ఈ సినిమాలో కొంత భాగాన్ని కట్‌ చేసి ఆ తర్వాత వారికి చూపించే ప్రయత్నం చేస్తానని సందీప్‌ తెలిపాడు. ఇలా సినిమా గురించి ఓపెన్‌గా చెప్పడం ఇండస్ట్రీలో చాలా అరుదు. తన వంతు బాధ్యతాయుతంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ఇలా చెప్పడంతో నెటిజన్ల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందులో అశ్లీలత అంతగా లేకున్నా కొంచెం వయలెన్స్‌ ఎక్కువుగా ఉంటుందని టాక్‌. ఇక కలెక్షన్స్‌ విషయానికి వస్తే ... ఏ మేరకు రాబడుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పిన సందీప్‌ సినిమా మాత్రం ఆందరనీ ఆలోచింపజేస్తుందని తెలిపాడు. కానీ యానిమల్‌ రూ.800 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు