ఈ ఏడాది కలిసొచ్చింది

3 Dec, 2023 01:30 IST|Sakshi

రణ్‌బీర్‌ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, మురాద్‌ ఖేతని, క్రిషణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో  ‘యానిమల్‌’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్‌ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్‌’ రూ. 35 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నాలుగు, ‘దిల్‌’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్‌లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్‌చరణ్‌గారి ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్‌ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు