ఎక్స్‌ట్రా వినోదం ఉంటుంది – నితిన్‌ 

3 Dec, 2023 01:20 IST|Sakshi

నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయ్‌..’ అనే మాస్‌ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు హ్యారిస్‌ జైరాజ్‌ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా రామ్‌ మిరియాల, ప్రియ హేమెస్‌ పాడారు.

ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నితిన్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లోనే బెస్ట్‌ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. సినిమా ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు పదింతల వినోదం మా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాకు సప్రోర్ట్‌ చేసిన నితిన్‌గారికి థ్యాంక్స్‌. ఇంట్రవెల్‌ సన్నివేశంలో ఓ మంచి ట్విస్ట్‌ ఉంది’’ అన్నారు వక్కంతం వంశీ. ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది’’ అన్నారు సుధాకర్‌ రెడ్డి. 
 

మరిన్ని వార్తలు