సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్‌ అనిత

12 Jun, 2021 10:37 IST|Sakshi

ముంబై: బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్‌ అనిత యాక్టింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తన చిన్నారితోనే పూర్తి సమయం గడపాలనుకుంటున్నానని, ఇది చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని తెలిపింది. 'నేను తల్లినైతే యాక్టింగ్‌ కెరీర్‌ నుంచి తప్పుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. ఇది కరోనా పాండమిక్‌ వల్ల తీసుకున్న నిర్ణయం కాదు. నా దృష్టి మొత్తం నా పిల్లాడి భవిష్యత్తుపైనే. తల్లిగా నా పూర్తి బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నా అందుకే ఇండస్ర్టీ నుంచి తప్పుకుంటున్నా. ప్రస్తుతం నటన అనేది నా చివరి ప్రయారిటీ. తిరిగి ఎప్పుడు  రీ ఎంట్రీ ఇస్తానో నాకే తెలియదు.


ఇక ఇంతకుముందే కొన్ని బ్రాండ్లకు సైన్‌ చేసినందుకు ఇప్పుడు ఆ వర్క్‌ కంప్లీట్‌ చేస్తున్నా.. యాడ్‌ షూటింగ్స్‌ అన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. షూట్‌ కోసం వచ్చిన వ్యక్తులకు ముందే కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహించి నెగిటివ్‌ వచ్చాకే లోపలికి అనుమతిస్తున్నాం. ఇక నేను మళ్లీ నటిస్తానన్నది నాకే తెలియదు. ఒకవేళ మళ్లీ రీఎంట్రీ ఉంటే తప్పుకుండా చెబుతాను' అని వెల్లడించింది. ఇక 'నువ్వు నేను', 'శ్రీరామ్‌', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ ''తాళ్, కుచ్‌ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్‌తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

చదవండి : భార్యలకు నచ్చే ట్రిక్‌ అంటూ భర్తను చాచి కొట్టిన నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు