నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌ గుట్టు విప్పిన అర్జున్‌ కల్యాణ్‌

17 Oct, 2023 13:05 IST|Sakshi

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్‌ అయ్యింది. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని కేవలం ఒక వారంలోనే బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి మిగిలిన కంటెస్టెంట్‌ల కంటే ఆమె మెరుగ్గానే ఆటలో తన సత్తా చూపినప్పటికే ఎలిమినేట్‌ అయ్యింది. దీంతో చాలామంది ప్రేక్షకులు నయని పావని ఎలిమినేషన్‌ను ఫేక్‌ అని కామెంట్లు చేస్తున్నారు. అమెను హౌస్‌ నుంచి పంపించడం చాలా అన్యాయం అని పలువురు కామెట్లు చేయగా.. యాంకర్ శివ కూడా ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తెలిపాడు.

ఓటింగ్‌కు, ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు
తాజాగా బిగ్‌బాస్‌- 6 కంటెస్టెంట్‌ అర్జున్ కల్యాణ్ కూడా నయని పావని ఎలిమినేషన్‌ ప్రక్రియను తప్పుపట్టాడు. నయని పావని ఎలిమినేట్ కావడంపై అర్జున్ కల్యాణ్ ఎక్స్ (ట్విటర్‌) ద్వారా స్పందించాడు. నయని పావనీని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో విలువను కోల్పోయింది అన్నాడు. ఆమె ఎలిమినేషన్‌ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, అది తనను ఎంతగానో బాధించిదని తెలిపాడు. ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇలా జరగడం కరెక్ట్‌ కాదని చెప్పాడు.

దీంతో బిగ్‌బాస్‌ క్రెడిబిలిటీ దెబ్బతినడమే కాకుండా షో నిర్వాహుకులకు భారీ నష్టమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రేక్షకులు వేసే ఓటింగ్‌కు, కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరాడు. బిగ్‌బాస్‌ అన్ని సీజన్స్ కి సంబంధించిన ఓటింగ్, ఎలిమినేషన్ వివరాలు  ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిల్ దాఖలు చేయాలని అర్జున్ కల్యాణ్ పేర్కొన్నాడు.

కోర్టులు ఖాళీగా లేవు
దీంతో అర్జున్‌ కల్యాణ్‌కు పలువురు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు సందించారు. ఇలాంటి పిల్స్ తీసోకోవడానికి కోర్టులు ఖాళీగా లేవని ఒకరు రాసుకొచ్చారు. దీంతో అర్జున్‌ ఇలా తిరిగి రిప్లై ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని  చాలామంది తెలుగువారు ఈ షో చూస్తున్నారు. ఆపై  ఓట్లు కూడా వేస్తున్నారు. కానీ వారి ఓట్లకు విలువ లేకుండా ఇలాంటి నిర్ణయాల తీసుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురౌతున్నారు. దీంతో కంటెస్టెంట్స్ కూడా నష్టపోతున్నారు.

(ఇదీ చదవండి: అమర్ ​దీప్​ బ్యాక్​గ్రౌండ్​​ తెలుసా.. లండన్‌లో స్టడీస్​, పొలిటికల్ ఫ్యామిలీ ఇంకా మరెన్నో..)

కేవలం ఓట్ల వల్లే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతూ ఇలాంటి తప్పుడు చర్యలతో బాధపెట్టడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి ఎలిమినేషన్స్ వల్ల వారికి కావాల్సిన టీఆర్పీ వస్తుంది. మా సీజన్‌లో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. అలా బిగ్‌బాస్‌పై బజ్‌ క్రియేట్‌ చేశారు. ఈ కారణాలు చాలవా పిల్ ఫైల్ చేయడానికి.' అంటూ అర్జున్‌ అభిప్రాయం చెప్పాడు.

బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌ సీక్రెట్‌ ఇదే
ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరో నెటిజన్‌ ప్రశ్నించాడు. మీ ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అర్జున్‌ను తప్పుపట్టారు. దీంతో ఆయన ఇలా తిరిగి సమాధానం ఇచ్చాడు. ' నేను ఎలిమినేషన్‌ సమయంలో బిగ్‌బాస్‌ వారు ఇచ్చిన అగ్రిమెంట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్నాను. నేను ఎలిమినేషన్ అయిన తర్వాత అసలు విషయం తెలిసింది. బిగ్‌బాస్‌ -6లో నేను ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు. ఇదే విషయం నాకు ఎంతో ఆలస్యంగా తెలిసింది.

బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌లో ఒక క్లాజ్‌ ఉంటుంది. హౌస్‌లోని ఒక కంటెస్టెంట్‌ను ఎప్పుడైనా, ఎలాగైనా, ఎటువంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేసే అధికారం షో నిర్వాహుకులకు ఉంటుంది.' అని అర్జున్‌ సెన్సేషనల్‌ విషయాన్ని తెలిపాడు. ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ వల్ల మాత్రమే జరగవు. హౌస్‌లో వాళ్లు ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు అనే విషయంపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్‌ అసలు గుట్టు ఇదా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అర్జున్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు బిగ్‌బాస్‌ టీమ్‌ ఏమైన సమాధానం చెబుతుందేమో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు