ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ వివాదం, ఎవరీ మున్‌మున్‌ ధమేచ, ఆర్భాజ్‌ మర్చంట్‌

4 Oct, 2021 15:43 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి డ్రగ్స్‌ వ్యవహరం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆర్యన్‌తో పాటు మున్​మున్ ధమేచ అనే యువతి, ఆర్బాజ్ సేతు మర్చంట్‌లతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆర్భాజ్‌.. ఆర్యన్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌ కాగా మున్‌మున్‌ ధామేచ ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీయగా.. మున్‌మున్‌ బిజినెస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యాషన్‌ మోడల్‌గా తెలిసింది.

చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నాను: ఆర్యన్‌

ఆమె వయసు 39. మున్‌మున్‌ స్వస్థలం మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరణించడంతో తన సోదరు ప్రిన్స్‌ ధమేచతో కలిసి 6 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తుంది. అయితే స్కూలింగ్‌ అంతా సాగర్‌లో చేసిన ఆమె ఆ తర్వాత పై చదువుల నిమిత్తం భోపాల్‌ల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఆర్యన్‌, మున్‌మున్‌తో పాటు ఆర్భాజ్‌ మర్చంట్‌, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా విచరాణలో నాలుగేళ్లుగా తాను డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆర్యన్‌ పోలీసులతో వెల్లడించాడు. 

చదవండి: Shahrukh Khan: షారుక్‌ ఖాన్‌కి భారీ షాక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు