ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్‌

18 Oct, 2021 13:16 IST|Sakshi

‘మా’ ఎన్నికలు ముగిసినప్పటికీ రోజుకో ట్విస్ట్‌తో ఎన్నికలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గుడుస్తున్నా మా ఎన్నికల్లో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్‌, విమర్శలు, దాడులతో చివరికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎన్నికల రోజున జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి.

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామానే అందింది: మంచు విష్ణు

రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించి సంగతి తెలిసిందే. ఇక ప్రకాశ్‌ ఆరోపణలపై నేడు తిరుపతిలో జరిగిన మీడియాలో సమావేశంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

చదవండి: ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే

అలాగే ఈ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన సీనియర్ నటుడు బాబూ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన.. ‘మా’లోని ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే అన్నారు. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని, ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా గెలుస్తారని పేర్కొన్నారు. అందరు మంచు విష్ణుకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రకాశ్‌ రాజ్ ప్యానల్ సభ్యులు ఆవేశం తగ్గించుకోవాలని, తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్లో చదివారన్నారు. కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అంటూ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు