NBK109 Vs Devara: బాలకృష్ణ VS తారక్‌.. పోటీగా దిగుతున్న బాలయ్య.. అప్పటి రిజల్ట్‌ రిపీట్‌ కానుందా?

9 Nov, 2023 08:17 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ vs జూనియర్ ఎన్టీఆర్ అనేలా వారిద్దరి మధ్య గ్యాప్‌ ఉన్న విషయం తెలిసిందే.. ఈ విషయంలో చాలా రోజుల నుంచి వారి ఫ్యాన్స్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి కూడా.. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో తారక్‌ స్పందించకపోవడంతో ఆయనపై  బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే.. దీంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు బహిర్గతం అయింది. దీంతో బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్‌ కేసరి కలెక్షన్స్‌పై పడింది. తారక్‌ ఫ్యాన్స్‌ ఆ సినిమాను చూడొద్దంటూ ఇంటర్నెట్‌లో వైరల్‌ చేశారు. ఇలా బాబాయ్‌, అబ్బాయి మధ్య వైరం మొదలైందని చెప్పవచ్చు.

2024 వేసవి సెలవుల్లో  బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే దేవర చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదుల చేస్తున్నట్లు డైరెక్టర్‌ కొరటాల శివ ప్రకటించాడు. మరోవైపు బాలకృష్ణ ఎన్‌బికె 109 చిత్రాన్ని డైరెక్టర్‌ బాబీ ప్రకటించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం  అయితే 2024 మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారట. సరిగ్గా దేవర చిత్రానికి కంటే ఒక వారం ముందుగానే విడుదల కానుంది. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి వార్‌ నడవడం ఖాయం అని తెలుస్తోంది.

ఇదే నిజం అయితే  తారక్‌ మరోసారి పైచేయి సాధించడం గ్యారెంటీ అంటూ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్‌లో తారక్‌ వెంట నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోలు ఫ్యాన్స్‌ కూడా ఉంటారు. ఆయన అందరితో సన్నిహితంగా మెలగడమే దీనికి ప్రధాన కారణం అంతే కాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా తారక్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రకంగా నందమూరి హీరోలు అంటే ప్రథమంగా వినిపించే పేరు తారక్‌ అని చెప్పవచ్చు. 

గతంలో తారక్‌దే పైచేయి
సంక్రాంతి బరిలో వారిద్దరూ పోటీపడ్డారు.. 2016లో నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్‌, డిక్టేటర్‌ సినిమాతో బాలయ్య వచ్చారు. జనవరి 13న తారక్‌ వస్తే.. జనవరి 14న డిక్టేటర్‌తో బాలయ్య పోటీలోకి దిగాడు. అలా తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొట్టారు. ఆ సమయంలో ఇద్దరి ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ నడిచింది. అప్పుడు ఏపీలో నాన్నకు ప్రేమతో సినిమాకు ఎక్కువ థియేటర్లు లేకుండా చూసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ తారక్‌ సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది. అదే సమయంలో డిక్టేటర్‌ మిస్‌ ఫైర్‌ అయింది.

అప్పటికే స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న తారక్‌కు మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. దీంతో ఎక్కడ చూసిన నాన్నకు ప్రేమతో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కానీ డిక్టేటర్‌ భారీ డిజాస్టర్‌ను మూట కట్టుకుంది. దీంతో అక్కడ బాబాయ్‌ మీద అబ్బాయిదే పైచేయి అయింది. మళ్లీ ఇదే సీన్‌ 2024లో రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడు టాలీవుడ్‌కే పరిమితమైన తారక్‌... ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్‌ మద్ధతు కూడా ఎక్కువగా జూ.ఎన్టీఆర్‌కే ఉంది. దేవర బొమ్మ థియేటర్లోకి వచ్చేంత వరకే బాలయ్య NBK 109 హడావిడి ఉంటుంది. ఏప్రిల్‌ 5 నుంచి ఎన్ని సినిమాలు ఉన్నా దేవరకు ఎవరు ఎదురు వచ్చినా కొట్టుకుపోవాల్సిందే.. అది నందమూరి బాలకృష్ణ అయినా సరే డౌటే లేదని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు