-
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్‌లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్‌లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్‌ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్‌లో జరిగిన ‘దేవర’ షూటింగ్‌లోనే జాయిన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్‌లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement