అందమైన అమ్మాయి

24 Sep, 2020 01:42 IST|Sakshi

అల్తాఫ్, అర్చనా గౌతమ్‌ హీరోహీరోయిన్లుగా వేముగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్‌’. లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై దేవదాస్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవదాస్‌ నారాయణ మాట్లాడుతూ– ‘‘షోలాపూర్‌లో నార్త్‌ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్‌ చేశాను.

ఆ అనుభవంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. వేముగంటిగారి దర్శకత్వంలో ఈ సినిమా బాగా వస్తోంది. అన్ని వాణిజ్య అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రభుత్వం విధించిన కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం.. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టై¯Œ మెంట్‌ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర మహావీర్, కెమెరా: మురళీ కృష్ణ. వై. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు