Bigg Boss: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌

16 Nov, 2023 12:37 IST|Sakshi

భార్యాభర్తల మధ్య వంద గొడవలు జరుగుతాయి. ఆ గొడవలన్నీ నీటిబుడగలాంటివే! ఇలా దెబ్బలాడుకుని అలా కలిసిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకునే జంట కూడా ఇదే కోవలోకి వస్తుంది. బాలీవుడ్‌ జంట అంకితా లోఖండే- విక్కీ జైన్‌ హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లోకి వెళ్లారు. ఇక బిగ్‌బాస్‌ ఉన్నదే ఆలూమగల మధ్య చిచ్చు పెట్టడానికి! ఈ క్రమంలో వీళ్లు ఎన్నో సార్లు గొడవపడ్డారు. తర్వాత ఎప్పటిలాగే కలిసిపోయారు.

ఒంట్లో బాగోలేదు.. పీరియడ్స్‌ కూడా..
అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయానికి బయటపెట్టింది అంకిత లోఖండే. 'నాకెందుకో ఒంట్లో బాగోలేనట్లు అనిపిస్తోంది. నాకు ఈ నెల పీరియడ్స్‌ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది అని భర్తతో వాపోయింది. దీంతో అవాక్కైన విక్కీ.. అదేంటి? నీకు పీరియడ్స్‌ వచ్చాయనుకున్నానే అని చెప్పగా.. లేదు.. నన్ను మెడికల్‌ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేశారు. నిన్న రక్తపరీక్షలు చేశారు. ఈరోజు మూత్రపరీక్ష చేశారు. కానీ ఫలితాలను మాత్రం చెప్పలేదు.

రిజల్ట్‌ కోసం వెయిటింగ్‌
అందుకే టెన్షన్‌ అవుతోంది. నేను ఎలా ఫీలవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాజిటివ్‌ ఫలితాలు వస్తే మాత్రం బిగ్‌బాస్‌ హౌస్‌లో పేరెంట్స్‌ అయిన జంటగా ఈ దంపతులు చరిత్రలో నిలిచిపోతారు. కాగా బిగ్‌బాస్‌ 17వ సీజన్‌ అక్టోబర్‌ 15 న మొదలైంది. ఈ సారి కూడా సల్లూ భాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: యావర్‌ చేతికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌.. రతిక సేవ్‌? కానీ ఆ లేడీ కంటెస్టెంట్‌ బలి!

మరిన్ని వార్తలు