దుమ్ము రేపే దేత్త‌డి హారిక‌

6 Sep, 2020 20:34 IST|Sakshi

యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ 3 టైమ్‌లో కూడా హారిక పేరు సోషల్‌ మీడియా లో వినిపించింది. కానీ తను అప్పుడు సెలక్ట్‌ కాలేదు. ఈ సీజన్‌కి మాత్రం బిగ్‌బాస్‌ టీమ్‌ ఫోకస్‌ హారికపై పడింది. హైదరాబాద్‌కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరుగా ఎదిగింది. యూట్యూబ్‌ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగు జ‌నాల‌కు ఎంత‌గానో దగ్గరైంది. దీనికి ముందు అమెజాన్‌లో మంచి ఉద్యోగం చేసేది.

కానీ జాబ్‌క‌న్నా న‌ట‌న‌కే త‌న ప్రాధాన్య‌త అంటూ ఉన్న‌ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి త‌న అభిమానుల‌కు వినోదాన్ని పంచేందుకే స‌మ‌యం కేటాయిస్తోంది. షార్ట్ ఫిల్మ్‌లోనూ న‌టించింది. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌తో పాటు త‌న‌ కుటుంబం అంతా బిగ్‌బాస్ షోకు వీర ఫ్యాన్స్ అని చెప్తోంది‌. తీరా ఇప్పుడు ఆవిడే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టే బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింది. ఇక హారికకు ఇప్ప‌టికే నెటిజన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. మ‌రి బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఫాలోయింగ్ మెయింటేన్ చేస్తుందా చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు