కరోనా ప్రభావిత రంగాలకు 10 లక్షల కోట్లు

6 Sep, 2020 20:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ వల్ల అన్ని రంగాలు సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలపై బ్యాంక్‌ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఏవియేషన్‌, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలు పుంజుకోవడానికి రూ. 10లక్షల కోట్లు కేటాయించే యోచనలో బ్యాంకింగ్‌ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం చేస్తుందని నిపుణులు తెలిపారు. అయితే గత వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సంక్షోభంలో ఉన్న రంగాలకు రుణ ప్రణాళికను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

వ్యాపారాలు నిరర్ధక ఆస్తులుగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈ) భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. రుణప్రణాళికపై ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) కూడా అధ్యయనం చేస్తుంది. కొన్ని నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంక్‌లు ప్రభావిత రంగాలకు రూ.8 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. (చదవండి: స్ప్రేల వల్ల కరోనా వైరస్‌ చస్తుందా!?)

మరిన్ని వార్తలు