Gangavva New House: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ

13 Nov, 2021 18:13 IST|Sakshi

Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్‌లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది.

చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

ఈ నేపథ్యంలో హోస్ట్‌ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్‌ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ  యూట్యూబ్‌ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి

ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్‌, బిగ్‌బాస్‌ టీం, స్టార్‌ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అఖిల్‌ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి!

చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ గృహప్రవేశం

మరిన్ని వార్తలు