బిగ్‌బాస్‌: హౌస్‌లో సుజాత‌కు ఆఖ‌రి రోజు!

11 Oct, 2020 15:29 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ విజ‌య‌వంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్ నుంచి సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్ వ‌రుస‌గా ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ హ‌ఠాత్తుగా షో నుంచి నిష్క్ర‌మించింది. ఇంటి స‌భ్యుల‌తోపాటు నాగ్ సైతం ఆమెకు గౌర‌వంగా వీడ్కోలు ప‌లికారు. అంతే కాకుండా కొత్త ఇల్లు క‌ట్టిస్తాన‌ని ఆమెకు మాటిచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. కాగా ఉన్న‌ప‌ళంగా అవ్వ షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ వారం ఎలిమినేష‌న్ ఉంటుందా? లేదా? అని బిగ్‌బాస్ వీక్ష‌కులు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. కానీ ప్రేక్ష‌కులు వేసిన ఓట్లు వృథా కాలేదు. వారు అభిమానించే వారిని సేవ్ చేస్తూనే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌వారిని బ‌య‌ట‌కు పంపిచ‌నున్నారు.  (చ‌ద‌వండి: బిగ్‌బాస్: ఆ విషయం మోనాల్‌దే తప్పన్న దివి)

సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈరోజు సుజాత ఎలిమినేట్ అవ‌నుంద‌ని లీకువీరులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు. త‌న న‌వ్వే ఆమె పాలిట శ‌త్రువుగా మారింద‌ని నెటిజ‌న్లు చెవులు కొరుక్కుంటున్నారు. ప్ర‌తిదానికి ఫేక్ న‌వ్వు విసురుతుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అలాగే నాగార్జున‌ను ప‌ట్టుకుని బిట్టూ అంటూ బిస్కెట్లు వేయడాన్ని ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో సుజాత ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్తుండ‌గా మాస్ట‌ర్ త్రుటిలో ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నారు. కానీ ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోతే వ‌చ్చేవారం మాస్ట‌ర్‌నే పంపించేస్తామ‌ని నెటిజ‌న్లు హెచ్చ‌రిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మ‌ళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగ‌వ్వ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు