రికార్డు సృష్టిస్తోన్న మోనాల్‌, అంతా అభి వ‌ల్లే!

28 Nov, 2020 15:56 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగుపెట్టిన ఉత్త‌రాది ముద్దుగుమ్మ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. క‌న్నీళ్ల వ‌ర‌ద పారిస్తూ నర్మ‌ద‌గా పేరు గ‌డించిన ఆమె టాస్కుల్లో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డక‌పోయినా ఆమె 12 వారాలుగా హౌస్‌లోనే ఉండ‌గ‌లుగుతోంది. మొద‌ట అభిజిత్‌తో క్లోజ్‌గా ఉంటూ త‌ర్వాత అఖిల్‌తో ద‌గ్గ‌ర‌వుతూ ట్ర‌యాంగిల్ స్టోరీ న‌డిపిన మోనాల్‌ ఈ సీజ‌న్‌లోనే అత్య‌ధిక‌సార్లు నామినేష‌న్‌లోకి వ‌చ్చింది. కొన్ని సార్లు అంద‌రిక‌న్నా త‌క్కువ ఓట్లు వ‌చ్చినా కూడా బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఆమెను ఎలిమినేట్ చేయ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఆమెను కాపాడ‌టం కోసం కుమార్ సాయి, దేవి నాగ‌వల్లి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను ఎలిమినేట్ చేశార‌ని ప్రేక్ష‌కులు ఆగ్ర‌హావేశాలు సైతం వ్య‌క్తం చేశారు.

హారిక వ‌ల్ల నామినేష‌న్‌లోకి..
ఈ నేప‌థ్యంలో ఆమె ఈ వారం కూడా నామినేష‌న్‌లో ఉంది. కాక‌పోతే త‌నంత‌ట తానుగా నామినేషన్‌లోకి రాలేదు. త‌ను కెప్టెన్ చేసి గెలిపించిన హారిక వ‌ల్ల నామినేష‌న్‌లోకి వ‌చ్చింది. నిజానికి మొద‌ట అభిజిత్‌, అరియానా, అవినాష్‌, అఖిల్ నామినేష‌న్‌లో ఉన్నారు. ఈ న‌లుగురు.. అఖిల్‌, మోనాల్‌తో స్వాప్‌(ఒక‌రి స్థానంలోకి మ‌రొక‌రు రావ‌డం) చేసుకునే అవ‌కాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. ఈ ఇద్ద‌రూ స్వాప్‌కు ఒప్పుకోక‌పోవ‌డంతో బిగ్‌బాస్ ఆదేశాల మేర‌కు కెప్టెన్ హారిక రంగంలోకి దిగింది. త‌న కెప్టెన్సీ ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి త‌న స్నేహితుడు అభిజిత్‌ను నామినేష‌న్ నుంచి సేవ్ చేసింది. అత‌డి స్థానంలోకి మోనాల్‌ను పంపించింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : అవినాష్‌కి ఏమైంది..ఎందుకలా చేశాడు?)

భారీ మొత్తంలో ఓట్లు.. ఇదే తొలిసారి!
దీంతో అవినాష్‌, అరియానా, అఖిల్‌తో పాటు మోనాల్ కూడా ఈ వారం ఎలిమినేష‌న్ జోన్‌లో ఉంది. కానీ ఈసారి మోనాల్‌కు రెండు విష‌యాలు బాగా అనుకూలించిన‌ట్లు క‌నిపిస్తోంది. హారిక‌ను కెప్టెన్ చేయ‌డం, అభిని నామినేష‌న్ నుంచి ‌కాపాడుతూ అత‌డి స్థానంలోకి వెళ్ల‌డం ఆమెకు మంచిపేరు తెచ్చి పెట్టాయి. వెర‌సి.. అటు హారిక అభిమానులు, ఇటు అభిజిత్ అభిమానులు కూడా పెద్ద మొత్తంలో ఈసారి మోనాల్‌కే ఓట్లు గుద్దిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితంగా ఎప్పుడు నామినేష‌న్స్‌లోకి వ‌చ్చినా చివ‌రి రెండు స్థానాల్లోనే ఊగిస‌లాడే మోనాల్ ఈ సారి మాత్రం రికార్డు స్థాయి ఓట్లు సంపాదిస్తూ మొద‌టి స్థానంలో దూసుకుపోతున్న‌ట్లు స‌మాచారం. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్‌తో డేట్‌.. అభి కంటతడి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు