నోయ‌ల్ త‌ర్వాత ఆమెకే..: రాహుల్‌

12 Sep, 2020 15:42 IST|Sakshi

బిగ్‌బాస్ మూడో సీజ‌న్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడు. ఎలాగో ఇంటిస‌భ్యుల్లో ఒక‌రు ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బ్యాగ్ స‌ర్దేయ‌నున్నారు. అయితే వారిని నేరుగా ఇంటికి పంపించ‌కుండా హౌస్‌మేట్స్‌పై వారి అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను పంచుకునేందుకు బిగ్‌బాస్ బ‌జ్ ఉండ‌నే ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి రాహుల్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అయితే కంటెస్టెంట్ల‌తో మాటామంతీ జ‌ర‌పాలంటే వారి గురించి అంతో ఇంతో తెలిసే ఉండాలి. ఇందుకోసం రాహుల్ ప్ర‌తిరోజూ బిగ్‌బాస్ షోను ఫాలో అవుతున్నాడట‌. (చ‌ద‌వండి: కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశ‌ల్‌)

టాప్ 5లో ఎవ‌రుంటారో ఇప్పుడే చెప్ప‌లేం
ఈ మేర‌కు ఓఇంట‌ర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. షో చూస్తున్నాను, కానీ ఎవ‌రు టాప్ 5లో ఉంటార‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఎందుకంటే ఇక్క‌డ మంచివాళ్లు.. చెడ్డ‌వాళ్లుగా, చెడ్డ‌వాళ్లు.. మంచివాళ్లుగా మారిపోయే ఆస్కారం ఉంటుంద‌న్నాడు. కంటెస్టెంట్ల‌లో త‌న‌కు నోయ‌ల్ త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా ప‌రిచ‌యం లేద‌ని పేర్కొన్నాడు. కాక‌పోతే బిగ్‌బాస్ ఇంట్లోకి యూట్యూబ‌ర్ల‌ను తీసుకురావ‌డం వారికి ద‌క్కిన‌ గొప్ప అవ‌కాశం అని తెలిపాడు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే త‌న జిగిరీ దోస్త్ నోయ‌ల్‌కే స‌పోర్ట్ చేస్తాన‌ని తెలిపాడు. నోయ‌ల్ త‌ర్వాత గంగ‌వ్వ‌పై  మంచి అభిప్రాయం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ వ‌య‌సులో ఆమె బిగ్‌బాస్ షోలో పాల్గొని యువ‌త‌తోపాటు చాలామందిని ఇన్‌స్పైర్ చేస్తుందన్నాడు. ప్రోమోలు కూడా ఆమె మీదే ఎక్కువ వ‌స్తున్నాయ‌ని, అటు ట్విట‌ర్‌లోనూ గంగ‌వ్వ హ్యాష్‌ట్యాగ్‌లు చాలానే ఉంటున్నాయ‌ని చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు