Bigg Boss 5 Telugu: షణ్ను లేకపోయుంటే సిరి టాప్‌ 5లో ఉండేదే కాదు: శ్రీరామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 Dec, 2021 17:24 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టాడు శ్రీరామచంద్ర. తను కోరినట్లుగానే లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్‌. షో నుంచి బయటకు వచ్చేసిన అతడు తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ బజ్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.

షణ్ముఖ్‌, సిరి, జెస్సీతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చన్నాడు. నామినేషన్స్‌లో సన్నీ, తాను పిచ్చిపిచ్చిగా అరుచుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లమని తెలిపాడు. నన్ను మొదటి వారం నుంచి నామినేట్‌ చేసిన ఏకైక వ్యక్తి యానీ మాస్టర్‌ అని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్‌ సపోర్ట్‌ లేకపోతే సిరి టాప్‌ 5లోకి వచ్చేదా? అన్న ప్రశ్నకు లేదని ఆన్సరిచ్చాడు శ్రీరామ్‌. తనకు తెలిసినంతవరకు షణ్ను లేకపోయుంటే సిరి ఫినాలేలో అడుగుపెట్టేది కాదన్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో మానస్‌కు, తనకు మధ్య కోల్డ్‌వార్‌ జరిగేదని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు