బిగ్‌బాస్‌ 5 తెలుగు: బిగ్‌బాస్‌ బజ్‌ హోస్ట్‌గా అరియాన గ్లోరీ!

14 Aug, 2021 20:39 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. బిగ్‌బాస్‌ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్‌ పెడుతూ ఈ షో ప్రోమోను నిర్వాహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే షో ప్రారంభం కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్‌ను అగష్టు 22న క్వారంటైన్‌కు పంపించనున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా బిగ్‌బాస్‌కు సీక్వెన్స్‌గా బిగ్‌బాస్‌ బజ్‌ అనే మరో కార్యక్రమం కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ షోకు హోస్ట్‌గ్‌ హౌజ్‌లో అంత్యంత క్రేజ్‌ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌ను నిర్ణయిస్తారు నిర్వహకులు. గత సీజన్లో హీరో తనిష్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌లు హోస్ట్‌గా వ్యవహరించగా ఈ సారి బిగ్‌బాస్‌ బజ్‌కు అరియాన గ్లోరీని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన హౌజ్‌లో వారి అనుభవాన్ని, ఇతర ఆసక్తిరకర విషయాలపై చర్చిస్తారు. కాగా నాలుగవ సీజన్‌లో అరియాన హౌజ్‌లో తనదైన తీరు, ముక్కుసూటి తనంతో ఎంతో మంది ప్రేక్షక ఆదరణను పొందింది. నేపథ్యంలో ఆమెకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బిగ్‌బాస్‌ బజ్‌కు అరియానను హోస్ట్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు