Bigg Boss 6 Elimination: షాకింగ్‌ ట్విస్ట్‌.. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..ఆ ఇద్దరు ఔట్‌

12 Nov, 2022 14:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఎలిమినేషన్‌ విషయంలో గత రెండు వారాలుగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు బిగ్‌బాస్‌. ఎనిమిదో వారంలో  స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న సూర్య ఎలిమినేట్‌ చేయగా..తొమ్మిదో వారంలో ఎవరూ ఊహించని విధంగా గీతూని బయటకు పంపారు. ఇక పదో వారంలో కూడా ప్రేక్షకులకు భారీ షాక్‌ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్‌. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందట. ఈ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్‌ శుక్రవారమే పూర్తవ్వడంతో.. ఎప్పటి మాదిరే ఈ వారం కూడా ఎలిమినేట్‌ అయినవారి పేర్లు బయటకు వచ్చాయి. 

ఈవారం ఎలిమినేషన్‌లో  ఇనయా, కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ మొత్తం 9మంది ఉన్నారు. వీరిలో నుంచి బాలాదిత్య, మెరీనా ఈ వారం ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.  ఓటింగ్ లీస్ట్ లో బాలాదిత్య లాస్ట్‌లో  ఉండగా.. మెరీనాను కూడా హౌజ్ నుంచి పంపించేందుకే డబుల్‌ ఎలిమినేషన్ పెట్టినట్లు  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  బిగ్‌బాస్‌ హౌస్‌లో బాలాదిత్య, మెరీనాకు మంచి పేరు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ.. గేమ్‌ని గేమ్‌గానే ఆడారు.  తమదైన ఆటతో తీరుతోప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక్క సిగరేట్ల విషయంతో తప్పితే బాలాదిత్య విషయంలో నెగెటివ్‌ అనేదే లేదు. ఇక మెరీనాకి అయితే ఇన్‌ అండ్‌ ఔట్‌ క్లీన్‌ ఇమేజ్‌ ఉంది.  మంచితనమే వీరికి మైనస్‌ అయినట్లు తెలుస్తుంది. 
 

మరిన్ని వార్తలు