Bigg Boss 7 Telugu Latest Promo: ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో.. వీళ్ల గొడవ మళ్లీ మొదలైంది!

4 Dec, 2023 12:12 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు గ్రాండ్‌ ఫినాలేకు ముహూర్తం దగ్గరపడింది. సీజన్‌ 7 కథ కంచికి చేరేందుకు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. గౌతమ్‌ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరిలో అర్జున్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచి నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌దీప్‌ను ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్‌ చేశారు. దీంతో అతడు కూడా నామినేషన్‌ ప్రక్రియలో ఉన్నాడు.

నిజానికి ఫినాలేకు దగ్గర్లో ఉన్న సమయంలో హౌస్‌మేట్స్‌ అంతా నామినేట్‌ అవుతుంటారు. కానీ ఈసారి నామినేషన్స్‌ను ఇంటిసభ్యుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్‌. ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంటారో వారి ముఖాలను టైల్స్‌పై స్టాంప్‌ వేసి, ఆ టైల్స్‌ను పగలగొట్టాలన్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

ప్రిన్స్‌ యావర్‌.. శోభను నామినేట్‌ చేశాడు. శోభ.. ప్రిన్స్‌, శివాజీలను నామినేట్‌ చేసింది. ప్రియాంక.. అమర్‌దీప్‌ను నామినేట్‌ చేసి అందరికీ షాకిచ్చింది. తాజా సమాచారం ప్రకారం అర్జున్‌ మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నామినేషన్స్‌ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: ఆ ఒక్కటే గౌతమ్‌కి మైనస్.. అందుకే ఇలా ఎలిమినేట్!

>
మరిన్ని వార్తలు