Bigg Boss 7 Day 77 Highlights: ఈ వారం నో ఎలిమినేషన్.. అసలు కారణం చెప్పిన నాగార్జున!

19 Nov, 2023 23:19 IST|Sakshi

బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్‌గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క పాయింట్‌లోనూ ఆసక్తిగా అనిపించలేదు. శివాజీపై ఏదో వేయాలని హోస్ట్ నాగార్జున అక్కడక్కడ సెటైర్లు వేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ ఏం జరగలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హోస్ట్ నాగ్ కారణం చెప్పాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 77 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

రతిక కన్నింగ్
ప్రిన్స్ యావర్.. ఫౌల్ గేమ్ ఆడి, వీడియోలతో సహా దొరికిపోయినందుకు తన ఎవిక్షన్ పాస్‌ని తిరిగిచ్చేయడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రియాంక, శోభా.. యావర్‌ని మెచ్చుకోగా రతిక మాత్రం తన్న కన్నింగ్‌నెస్ బయటపెట్టింది. 'సేఫ్ గేమ్ ఆడావ్ నువ్వు, ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందని తిరిగిచ్చేశావ్ కదా' అని యావర్‌తో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఇక సింపతీ కొట్టేద్దామని ఫిక్స్ అయిన శివాజీ.. బూతులు మాట్లాడినందుకు అందరికీ సారీ చెప్పేశాడు. 

(ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్‌ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్‌)

సండే ఫన్‌డే కాదు
ఇకపై సండే అంటే ఫన్‌డే కాదని చెప్పిన నాగార్జున.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్' టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరు.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు.

ఎవరు.. ఎవరెవరికి ఏ ట్యాగ్ ఇచ్చారు?
కంటెస్టెంట్స్..   ఫ్రెండ్.. బ్లాక్ హౌస్‌మేట్

  • గౌతమ్ - ప్రశాంత్, శోభాశెట్టి
  • అమర్‌దీప్ - ప్రశాంత్, రతిక
  • రతిక - శోభాశెట్టి, అమర్
  • శోభాశెట్టి - రతిక, గౌతమ్
  • అశ్విని - శోభాశెట్టి, గౌతమ్
  • యావర్ - శోభాశెట్టి, గౌతమ్
  • ప్రశాంత్ - అమర్‌దీప్, రతిక
  • అర్జున్ - శివాజీ, యావర్
  • శివాజీ - అర్జున్, రతిక
  • ప్రియాంక - ప్రశాంత్, అశ్విని

శివాజీ మళ్లీ అలానే
ఆదివారం ఎపిసోడ్‌లో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ ప్రమోషన్‌లో భాగంగా వచ్చారు. అయితే అంతా మాట్లాడుతున్న సమయంలో.. శివాజీని పెద్దాయన అని శ్రీకాంత్ సరదాగా అన్నాడు. దీంతో.. తనని అందరూ పెద్దాయన-పెద్దాయన అని అనడంపై శివాజీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తలుపులు తీస్తే ఎల్లిపోతా సర్, ఇది నరకంగా ఉంది అని బుర్ర బాదుకుని మరీ పాత శివాజీని గుర్తుచేశాడు. సరదాకి అన్నాసరే శివాజీ అంటున్నాడనేది అర్థం కాలేదు. ఇకపోతే సేవింగ్‌లో భాగంగా తొలి రౌండ్‌లో యావర్, ప్రియాంక.. రెండో రౌండ్‌లో అర్జున్, అమర్‌దీప్ సేవ్ అయ్యారు. మూడో రౌండ్‌లో శోభాశెట్టి, రతిక సేవ్ అయ్యారు. చివరగా గౌతమ్, అశ్వినిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నారు. కానీ ఇద్దరు సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తద్వారా ఈ వారం నో ఎలిమినేషన్ అని తేలింది.  

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్‌బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?)

నో ఎలిమినేషన్‌కి కారణమదే
అయితే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేని పరిస్థితుల్లో అంటే ఈ రోజు ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గతవారం కేవలం ఐదుగురికి మాత్రమే ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే ఛాన్స్ వచ్చిందని, ఈ వారం మాత్రం అందరూ దానికోసం పోటీపడే అవకాశమొస్తుందని నాగ్ చెప్పాడు. అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందనేది బిగ్‌బాస్ డిసైడ్ చేస్తారని నాగ్ వివరణ ఇచ్చాడు. అలానే రాబోయే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ షాక్ ఇచ్చాడు. అంటే ఈ వారం మిస్ అయినోడు, నెక్స్ట్ వారం కలిపి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపేస్తారనమాట.

అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు రతిక.. తెగ భయపడిపోయింది. దీంతో నాగార్జున ఆమెని సముదాయించాడు. 'ఏంటి రతిక.. సేవ్ అయ్యావని నమ్మలేకపోతున్నావా?' అని నాగార్జున అడిగాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సర్ అని తన ఆనందాన్ని, భయాన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ రతిక బయటపెట్టింది. చివరవరకు వచ్చేసరికి అశ్విని కూడా అలానే భయపడిపోయింది. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి రతిక, అశ్విని.. హమ్మయ్యా అనుకున్నారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ)

మరిన్ని వార్తలు