Bigg Boss 7 Day 94 Highlights: పవర్ చూపించిన అర్జున్.. యావర్, ప్రశాంత్ జస్ట్ మిస్!

6 Dec, 2023 22:39 IST|Sakshi

బిగ్‌బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్‌గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్‌గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?)

అర్జున్ కేక్ టాస్క్
శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్‌బాస్ చెప్పాడు.

పిల్లలని ఆడించే గేమ్
ఎపిసోడ్‌ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్‌బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్‌టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని  తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

అర్జున్-ప్రశాంత్ గొడవ
ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు.  అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్‌ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. 

దీంతో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్‌లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్‌లో తేలుస్తుంది.

(ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?)

>
మరిన్ని వార్తలు