' నేను అబద్ధం.. వాడే నిజం.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా?'.. రైతుబిడ్డపై రెచ్చిపోయిన అమర్!

7 Dec, 2023 19:35 IST|Sakshi

తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్‌లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్‌ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్‌మేట్స్‌తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్‌బాస్ ఈసారి త్రో బాల్‌ టాస్క్‌ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. 

ఈ టాస్క్‌లో ప్రతి రౌండ్‌లో ఎవరీ జాకెట్‌కు అయితే ఎక్కువ బాల్స్‌ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్‌  నుంచి ఎలిమినేట్‌ అవుతారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే గేమ్‌ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్‌ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది.

దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్‌ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. 

రేయ్ హౌస్‌లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్‌ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్‌ కౌంటరిచ్చాడు. అమర్‌ను శోభా వారిస్తుండగా.. అర్జున్‌ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. 

>
మరిన్ని వార్తలు