తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్

16 Feb, 2021 12:07 IST|Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ రెండూ తీసుకొచ్చింది. బిగ్‌బాస్‌ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఫేమస్‌ అయిపోయారు. వీరిలో సోహైల్ ఒకడు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌ ఒక్కసారిగా ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.100 రోజులపాటు హౌస్‌లో సందడి చేసిన ఈ కరీంనగర్ కుర్రోడు షోలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. విన్నర్ కాకపోయినా అదే రేంజ్‌లో తనపై దృష్టి పడేలా చేసుకున్నాడు. 

బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్‌ లైఫ్‌ టర్న్‌ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్‌కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్‌.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్‌ స్నేహితుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. 

తాజాగా సోహైల్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి వృత్తిపరంగా కాకుండా ఓ ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి, సోదరుడితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు. అదే.. సోహైల్‌ కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన దాని ధర దాదాపు రూ. 30 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ‘కొత్త కారు కొనాలనే కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసినందుకు బిగ్‌బాస్‌కు, అలాగే ఎప్పుడూ నాకు ఆదర్శంగా నిలిచే మా నాన్నకు కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగల‌గా.. బిగ్‌బాస్‌ నుంచి సోహైల్‌ స్వచ్ఛందంగా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌ను సోహైల్‌ అంగీకరించి ఇంటిని వీడాడు.
చదవండి: మెగాస్టార్‌ ఇంట్లో బిగ్‌బాస్‌ తురుమ్‌ఖాన్‌ సందడి
అభిజీత్‌ను వెనక్కినెట్టిన అఖిల్‌..

A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు