మీరు సిగ్గుప‌డితే చ‌చ్చిపోవాల‌నుంది: నాగ్‌

4 Oct, 2020 15:46 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా టాస్క్ ఇస్తే చాలు.. అమ్మాయిల జోలికి వెళ్ల‌ద్ద‌ని కొంద‌రు, అమ్మాయిల‌ను అడ్డు పెట్టుకుని ఆడొద్దు అని మ‌రికొంద‌రు వార్నింగ్‌లు ఇచ్చుకుంటారు. ప్రతిసారి వారిని బ‌ల‌హీనులుగా చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌పై అలాంటివి జ‌ర‌గ‌కుండా చూసుకునేందుకు నాగ్ సంసిద్ధ‌మ‌య్యారు. కంటెస్టెంట్ల‌కు జెండ‌ర్ ఈక్వాలిటీ టాస్క్ ఇచ్చారు. సింపుల్‌గా చెప్పాలంటే బిగ్‌బాస్ హౌస్‌ను జంబ‌ల‌కిడి పంబ‌గా మార్చేశారు. అబ్బాయిలు అమ్మాయిల వేషం క‌ట్ట‌గా అంద‌మైన భామ‌ల‌తో పాటు బామ్మ కూడా మ‌గ‌రాయుడిలా రెడీ అయ్యారు. అయితే ఈ న‌కిలీ అమ్మాయిల అందాల‌ను చూడ‌లేక నాగ్ సిగ్గుతో త‌ల దించుకున్నారు. (చ‌ద‌వండి: అఖిల్ ప‌డుకున్నాక అభితో మోనాల్‌ ముచ్చ‌ట్లు!)

అక్క‌డ వాళ్లు మాత్రం వ‌య్యారాలు పోతూ, సొగ‌సును చూపిస్తూ చిందులేశారు. మీరు సిగ్గుప‌డుతుంటే తాను చ‌చ్చిపోయేలా ఉన్నాన‌ని నాగ్ అబ్బాయిల‌కు కౌంట‌ర్ వేశారు. అంద‌రి క‌న్నా గంగ‌వ్వ గెట‌ప్ హైలెట్‌గా నిలిచింది. త‌ల‌పై విగ్గు, ప్యాంటు ష‌ర్ట్‌, మూతికి మీసం పెట్టుకుని మ‌గరాయుడు అనిపించింది. ఇంత క‌ష్ట‌ప‌డి గెట‌ప్‌లు వేసుకున్నాక ఊరికే ఉంటారా? జ‌ంట‌లుగా విడ‌గొట్టి డ్యాన్సులు కూడా చేయించారు. ఈ క్ర‌మంలో అబ్బాయిలా మారిపోయిన హారిక ఇంకా పొట్టిగా క‌నిపించ‌డంతో నువ్వు ఏ క్లాస్ అంటూ అవినాష్ ఆమెను ఆట‌ప‌ట్టించాడు. మ‌రి ఇంటి స‌భ్యుల వేష‌ధార‌ణ‌, వారు చేసే కామెడీని చూసి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వాలంటే ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల్సిందే! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు