అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో

15 Dec, 2020 17:01 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ముగింపుకు చేరుకుంటున్న స‌మ‌యంలో లోప‌లున్న కంటెస్టెంట్ల‌ను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియా లెక్క ప్ర‌కారం ఇప్పుడున్న ఫైన‌లిస్టుల్లో అభిజిత్‌కే ప్రేక్ష‌కుల‌ స‌పోర్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం అభికే మ‌ద్ద‌తు తెలిపాడు. వీరిద్ద‌రూ గ‌తంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో క‌లిసి న‌టించారు. ఇదే సినిమాలో నటించిన మ‌రో హీరో సుధాక‌ర్ కోమాకుల కూడా మొద‌టి నుంచి అభికే త‌న మ‌ద్ద‌తు తెలుపుకుంటూ వ‌చ్చాడు. బిగ్‌బాస్ ఫైన‌ల్ వీక్‌లోకి అడుగు పెట్టిన సంద‌ర్భంగా సుధాక‌ర్ మ‌రో స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్‌)

ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ..
"బిగ్‌బాస్ కంటెస్టెంటు అభిజిత్ నా క్లోజ్ ఫ్రెండ్‌. టైటిల్ ద‌క్కించుకునేందుకు ముందు వ‌రుస‌లో ఉన్నాడు. రెండు నెల‌ల క్రితం అత‌డి గురించి వీడియో చేసిన‌ప్పుడు పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వ‌చ్చాయి. అయితే అప్ప‌టికీ, ఇప్ప‌టికీ అభి గ్రాఫ్ పెరిగిపోయింది. అత‌డిని బిగ్‌బాస్ విన్న‌ర్‌గా చూడాల‌నుకుంటున్నా. అత‌డు హౌస్‌లో అంద‌రూ స‌ర్‌ప్రైజ్ అయ్యేలా ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇన్ని సీజ‌న్ల‌లో ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ అభికి వ‌చ్చింది. కానీ అత‌డు బిగ్‌బాస్‌లోకి వెళ్లిన‌ప్పుడు టైటిల్ ఫేవరెట్ కాద‌నే చెప్పాలి. లోప‌లికి వెళ్లే వారం ముందు నాతో మాట్లాడాడు. నేను నాలా ఉంటా. పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అరేయ్ మామా, మ‌నం ఒక్క‌సారి దిగిన‌మంటే సిక్స్ కొడితే బాల్‌ స్టేడియం అవ‌త‌ల పడాల్సిందే, టైటిల్ గెల‌వాల్సిందేన‌ని చెప్పాను. అత‌డేమో ఎక్స్‌పీరియ‌న్స్ కోసం వెళ్తున్నా కానీ చూద్దామ‌ని చెప్పాడు." (చ‌ద‌వండి: ఆ హౌజ్‌మెట్‌కే నా మద్దతు: విజయ్‌ దేవరకొండ)

నీ కోసం అమెరికా నుంచి వ‌చ్చాను
"ఎన్నిసార్లు నామినేష‌న్‌లోకి వెళ్లినా ప్రేక్ష‌కులు ఎక్కువ ఓట్లు వేసి సేఫ్ చేశారు. రోబో టాస్క్ త‌ర్వాత అత‌డికి పేరొచ్చింది. భుజాల నొప్పి, మోకాళ్ల  స‌మ‌స్య ఉండ‌టం వ‌ల్ల ఫిజిక‌ల్ టాస్కులు చేయ‌లేక‌పోయాడు. అయినా స‌రే త‌న బెస్ట్ ఇచ్చాడు. ఏ ప‌రిస్థితిలోనైనా బ్యాలెన్స్‌గా ఉంటాడు. బ‌య‌ట ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. టాస్క్‌లో ఫ్రెండ్స్‌ను ప‌క్క‌న పెట్టాడు. ఎవ‌రికైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే వెళ్లి సాయం చేస్తాడు. ఏదైనా త‌ప్పు చేస్తే సారీ చెప్పి దాన్ని స‌రిదిద్దుకున్నాడు. ఇలా ఎన్నో గొప్ప ల‌క్ష‌ణాలు ఉన్న అభికి ఓటు వేసి గెలిపించండి" అని  సుధాక‌ర్‌ అభిమానుల‌ను కోరాడు. చివ‌ర్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోని నాగ‌రాజు పాత్ర‌లోకి దూరిపోయి ఓ డైలాగ్ విసిరాడు. "అరేయ్ మామా అభిజిత్‌, బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకుని రా. బీ ఫేస్ మొత్తం వెయిట్ చేస్తుంది. మ‌స్త్ దావ‌త్ చేసుకుందాం. ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వ‌చ్చిన‌రా బై నీకోసం.. బిగ్‌బాస్ 4 విన్న‌ర్ కావాలి చెప్తున్నా.." అంటూ అభిని విజేత‌గా నిల‌పండ‌ని ప్రేక్ష‌కుల‌కు పిలుపునిచ్చాడు. (చ‌ద‌వండి: అరియానాకు ఓటేయ‌మ‌ని ఆర్జీవీ పిలుపు)

మరిన్ని వార్తలు