Bigg Boss 5 Telugu: యానీకి స్పెషల్‌ పవర్‌, ప్రియ అవుట్‌, ప్రియాంక కన్నీటి రోదన

24 Oct, 2021 23:12 IST|Sakshi

Bigg Boss 5 Telugu, Priya Eliminated: బిగ్‌బాస్‌ షోలో స్టేజీమీదకు వచ్చీరావడంతోనే నాగార్జున ఇంటిసభ్యులతో గేమ్స్‌ ఆడించేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి కాస్త డిఫరెంట్‌గా గేమ్‌లో గెలిచినవారికి బిగ్‌బాస్‌ షీల్డ్‌తో పాటు ఓ స్పెషల్‌ పవర్‌ దక్కుతుందన్నాడు. ఇక ఈ గేమ్‌లో కొన్ని లెవల్స్‌ ఉంటాయని చెప్పాడు. ఫస్ట్‌ రౌండ్‌లో 'పట్టుకోండి చూద్దాం' గేమ్‌ ఆడించాడు. ఇందులో గుండ్రటి వలయంలో ఉన్న పిల్లోస్‌ను ఇంటిసభ్యులు దక్కించుకుని కాపాడుకోవాలి. ఈ గేమ్‌లో పిల్లో సాధించలేకపోయిన సిరి.. షణ్ను దగ్గరున్న దిండు ఇవ్వమని బతిమాలుకుంది. దొరికిందే ఛాన్స్‌ అనుకున్న షణ్ను.. ఆమెతో 10 సార్లు సారీ చెప్పించుకుని పిల్లో త్యాగం చేసేశాడు. చివరగా ఈ ఆటలో షణ్ను, కాజల్‌ ఓడిపోయారు.

నీళ్లు-కన్నీళ్లు..  ఓడిపోయిన రవి, లోబో
రెండో రౌండ్‌లో 'చలనచిత్ర వీర' గేమ్‌ ఆడించాడు. ఇందులో నాగ్‌ అడిగే సినిమా ప్రశ్నలకు ముందుగా బెల్‌ కొట్టి సమాధానాలు చెప్పిన వారు తర్వాతి రౌండ్‌కు అర్హులవుతారు. ఇందులో తప్పు సమాధానాలు చెప్పి జెస్సీ, ప్రియాంక, మానస్‌ అనర్హులవగా మిగిలినవారు నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లారు. మూడో రౌండ్‌లో నాగ్‌ 'నీళ్లు-కన్నీళ్లు' గేమ్‌ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లు జగ్గులు పట్టుకుని స్విమ్మింగ్‌ పూల్‌లోని నీళ్లను వారి క్యాన్‌లో నింపాలి. ఈ రౌండ్‌లో రవి, లోబో ఎలిమినేట్‌ అయ్యారు. అనంతరం నాగ్‌.. లోబో సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్‌
నాలుగో రౌండ్‌లో యానీ, విశ్వ, శ్రీరామ్‌, సన్నీ, సిరి మ్యూజికల్‌ చెయిర్‌ ఆడారు. ఇందులో సిరి, సన్నీ అవుట్‌ అయ్యారు. ఐదో రౌండ్‌ 'పట్టుపట్టు రంగే పట్టు' గేమ్‌లో నాగ్‌ ఏ కలర్‌ చెప్తే ఆ కలర్‌లో ఉన్న వస్తువులను హౌస్‌లో నుంచి తీసుకురావాలి. ఈ గేమ్‌లో శ్రీరామ్‌ అవుట్‌ అయ్యాడు. ఆటల పోటీలో మిగిలిన ఇద్దరిలో విశ్వకు రవి, లోబో, కాజల్‌, శ్రీరామ్‌ సపోర్ట్‌ చేయగా యానీకి మిగిలినవారంతా మద్దతు తెలిపారు. ఇందులో అవతలి టీమ్‌ విశ్వ టోపీని ముందుగా పడగొట్టడంతో అతడు ఓడిపోగా యానీ గెలిచింది. దీంతో ఆమెకు పవర్‌ ఉన్న బిగ్‌బాస్‌ షీల్డ్‌ దక్కింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు నాగ్‌. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో మిమ్మల్ని అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్‌ అయ్యాడని తెలిపాడు.

అందరికీ గుడ్‌బై చెప్పిన యానీ, ప్రియ
నామినేషన్స్‌లో మిగిలిన ఇద్దరు ప్రియ, యానీలను హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్‌. దీంతో ఎవరికి వారు తమ ఎలిమినేషన్‌ ఖాయం అనుకుంటూ అందరికీ భారంగా వీడ్కోలు చెప్పారు. అనంతరం ఇద్దరూ గార్డెన్‌ ఏరియాలో ఉన్న బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సు తెరిచి చూడొచ్చని నాగ్‌ చెప్పగా ఇంటిసభ్యులు ఎంతో ఆతృతగా వాటిని ఓపెన్‌ చేశారు. కానీ రెండు బాక్సుల్లోని ఇద్దరూ మాయం అవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్‌ అవుతారేమోనని నాగ్‌ అనడంతో మరింత ఆందోళన చెందారు.


గుక్క పెట్టి ఏడ్చిన పింకీ, ఓదార్చిన మానస్‌
ప్రియ వెళ్లిపోతుందేమోనని గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడ్చేయగా మానస్‌ ఆమెను ఓదారచ్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ పింకీ అతడి భుజంపై వాలిపోయి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మరోవైపు యానీ హౌస్‌లోకి రావడంతో సన్నీ ఆమెను గట్టిగా హత్తుకుని ఎమోషనల్‌ అయ్యాడు. కానీ పింకీ మాత్రం రోదిస్తూనే ఉండగా ఆమెను ఓదార్చడం మానస్‌ వల్ల కూడా కాలేదు. ఇక స్టేజీ మీదకు వచ్చిన ప్రియ బిగ్‌బాస్‌ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానంది.

మరిన్ని వార్తలు