Bigg Boss Telugu 6: అర్జున్‌ కల్యాణ్‌ దృష్టిలో శ్రీసత్య కేవలం కంటెంట్‌ మాత్రమే!

17 Dec, 2022 16:48 IST|Sakshi

గ్రాండ్‌ ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన శ్రీసత్యకు బిగ్‌బాస్‌ షాకిచ్చాడు. ఫినాలేకు చేరకుండానే మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ద్వారా ఆమెను బయటకు పంపించేశాడు. దీంతో హౌస్‌ను వీడలేక వీడి వచ్చేసింది శ్రీసత్య. తాజాగా ఆమె బిబి కెఫెలో యాంకర్‌ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ముందుగా యాంకర్‌ శివ మాట్లాడుతూ.. శ్రీహాన్‌ మారిపోయాడంటున్నావేంటి అని అడిగాడు. అందుకు శ్రీసత్య.. అతడు మారడం తప్పనట్లేదు. కానీ సడన్‌గా ఫ్లిప్‌ అయ్యాడని చెప్పింది. వెంటనే అందుకున్న శివ.. ఫ్లిప్పింగ్‌ల కోసం నువ్వు మాట్లాడుతున్నావా? అని సెటైర్‌ వేశాడు. గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను ఫుడ్‌ మీద కోపం చూపించలేదని బదులిచ్చింది.

అలాగే ఓసారి శ్రీహాన్‌, నేను కావాలనే ఇనయను రెచ్చగొట్టామంది. కాకపోతే అది గేమ్‌లో భాగంగానే స్పష్టం చేసింది. శ్రీహాన్‌, నువ్వు, రేవంత్‌ కావాలని బ్యాచ్‌గా ఏర్పడినట్లు అనిపించిందన్న శివ.. మీరు కావాలని గొడవలు పెట్టుకుంటారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అవాక్కైన శ్రీసత్య.. ఫ్రెండ్సంటే కొట్టుకుంటారు కదా, అందులో తప్పేముందన్నట్లుగా ఫేస్‌ పెట్టింది. దీనికి శివ స్పందిస్తూ ఫ్రెండ్స్‌ తప్పులను వారి వెనకాల వెళ్లి చెప్పడం ఫ్రెండ్‌షిప్‌ కానే కాదని కుండ బద్ధలు కొట్టాడు.

తర్వాత అర్జున్‌ కల్యాణ్‌ గురించి అడగ్గా డీసెంట్‌ బాయ్‌ అని చెప్పింది శ్రీసత్య. తనకు తెలిసినంతవరకు అతడికి నేనంటే ఇష్టం, ప్రేమ ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇంతలో శివ ఓ వీడియో చూపించాడు. అందులో అర్జున్‌.. ఎలాగో నేను శ్రీసత్య వెనకాల తిరుగుతున్నాను. నువ్వు నా వెనక పడితే కంటెంట్‌కు మంచి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అయ్యేది కదా అంటూ వాసంతితో మాట్లాడాడు. ఈ వీడియో చూపించిన శివ.. అర్జున్‌ కల్యాణ్‌ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్‌ అని చెప్పగా శ్రీసత్యకు నోట మాట రాక షాక్‌లో ఉండిపోయింది.

చదవండి: శ్రీసత్య ఎలిమినేట్‌, క్షమించని వేడుకున్న శ్రీహాన్‌
శ్రీసత్య పారితోషికం ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు