బాయ్‌కాట్‌ బింగో‌.. ఐటీసీ వివరణ

24 Nov, 2020 18:50 IST|Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా నటించిన బింగో మ్యాడ్‌యాంగిల్స్‌ యాడ్‌పై నెటిజనులు తీవ్రంగా విరుకుచపడిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో రణవీర్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ని కించపరిచారని నెటిజనలు ఆరోపించారు. దాంతో బాయ్‌కాంట్‌ బింగో అంటూ రణ్‌వీర్‌ని ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

"బింగో మ్యాడ్‌ యాంగిల్స్‌ తాజా ప్రకటన దివంగత బాలీవుడ్‌ ప్రముఖుడిని ఎగతాళి చేసేలా రూపొందించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సందేశాలు, పోస్టులకు బలైపోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి ప్రసారం అవుతోన్న బింగో మ్యాడ్‌యాంగిల్స్‌ యాడ్‌ని ఒక సంవత్సరం క్రితం అక్టోబర్ 2019 లో షూట్‌ చేశాం. బింగో ప్రయోగం ఆలస్యం కావడంతో ఈ ప్రకటన ఈ ఏడాది ప్రసారం అవుతోంది. కోవిడ్‌ కారణంగా ‘మ్యాడ్ యాంగిల్స్ చీజ్ నాచోస్ అండ్‌ బింగో!’ ‘మ్యాడ్ యాంగిల్స్ పిజ్జా’ లాంచ్‌ చేయడంలో ఆలస్యం జరిగింది" అంటూ ఐటీసీ ఫుడ్స్‌ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. (బాయ్‌కాట్ బింగో: ర‌ణ్‌వీర్‌పై ట్రోలింగ్‌)

ఇక బింగో మ్యాడ్‌ యాంగ్సిల్‌ ప్రకటనలో రణ్‌వీర్‌ తన తదుపరి ప్లాన్‌ గురించి బంధువులకు వివరిస్తూ.. పార‌డాక్సిక‌ల్ ఫొటాన్స్‌, అల్గారిథ‌మ్స్‌, ఏలియ‌న్స్.. అంటూ చెప్తూ ఇదే త‌న నెక్స్ట్ ప్లాన్ అని జ‌వాబివ్వ‌డంతో అంద‌రూ షాక్ అవుతారు. అయితే ఈ యాడ్‌లో ఎక్క‌డా సుశాంత్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. కానీ దివంగత నటుడి అభిమానులు మాత్రం  సుశాంత్ మాత్ర‌మే ఫొటాన్స్‌, ఏలియ‌న్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవార‌ని, కావాల‌నే ఈ యాడ్‌లో అత‌న్ని టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. ఈ యాడ్‌ని వెంటలనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు