Brad Pitt: స్కర్ట్‌ వేసుకున్న స్టార్‌ హీరో.. మనందరం చనిపోతామని వివరణ

3 Aug, 2022 20:10 IST|Sakshi

Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్‌ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్‌ హీరో. హాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్‌ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్‌ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్‌ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్‌ పిట్‌ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్‌ ట్రైన్‌'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్‌ ట్రైన్‌' ప్రీమిర్‌ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్‌ కార్పెట్‌పై స్కర్ట్‌ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్‌ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్‌, బూట్‌లు, వదులుగా ఉండే నార షర్ట్‌, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్‌ పిట్‌ లుక్‌ వరల్డ్‌వైడ్‌గా వైరల్‌ అయింది. బ్రాడ్ పిట్‌ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్‌ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్‌ షోలో స్పందించాడు బ్రాడ్‌ పిట్‌.

చదవం‍డి:  సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్

ఈ ప్రీమియర్‌ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్‌ పిట్‌.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్‌ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు.  

చదవం‍డి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్‌ హ్యాపీనా..

మరిన్ని వార్తలు