Sankranthi 2024 Movies: సంక్రాంతి రేసు నుంచి రెండు టాప్‌ సినిమాలు ఔట్‌

1 Jan, 2024 18:37 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ గతేడాది  'సార్‌' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.  ఇప్పుడు అదే జోష్‌ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన  'కెప్టెన్‌ మిల్లర్‌'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో  శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది.

(ఇదీ చదవండి: భారత్‌ సినిమాలపై పాక్‌ ప్రముఖ హీరో రియాక్షన్‌)

ధనుష్‌, శివకార్తికేయన్‌ ఇద్దరు కూడా  తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్‌ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో తెలుగు స్ట్రైట్‌ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్‌, హనుమాన్‌, సైంధవ్‌, నా సామిరంగా చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్‌ చిత్రాలు అయిన కెప్టెన్‌ మిల్లర్‌, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది.

దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్‌ సినిమా విడదల విషయంలో​ యూ టర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్‍ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్‌లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్‍కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.

>
మరిన్ని వార్తలు