Chandra Mohan: 'శోభన్‌ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?

11 Nov, 2023 13:05 IST|Sakshi

టాలీవుడ్‌లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది.

(ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు! )

దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్‌ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు గెలిచారు.

అప్పటి హీరోలైన శోభన్‌ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్‌ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. 

(ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత )

గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్‌బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్‌ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు