ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

1 Jun, 2021 08:20 IST|Sakshi

బెంగళూరు: కన్నడ సూపర్​ స్టార్​ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్​వుడ్​లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్​ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్​ చేసిన ఉప్పీ..  కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్​పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్​ చేయడం దుమారం రేపుతోంది.
 
‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్​మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్​ వీడియోలో పరోక్షంగా  ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్​ చేతన్​పై మండిపడుతున్నారు. చేతన్​కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్​ హీరో దర్శన్​ తప్పుబడుతూ ఓ స్టేట్​మెంట్ రిలీజ్​ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు.


కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్​.. డజన్​కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్​.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్​ గిఫ్ట్​గా అందించి వార్తల్లో నిలిచాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు