Chinna And Martin Luther King In OTT: థియేటర్లలో సరిగా ఆడలేదు.. ఓటీటీలో ఏం చేస్తాయో?

21 Nov, 2023 16:27 IST|Sakshi

ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు.

ఎమోషనల్ 'చిన్నా'
సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో  'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి.

సంపూ డిఫరెంట్ సినిమా
లాక్‌డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‍‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!)

మరిన్ని వార్తలు