-
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'యానిమల్' తప్పితే చెప్పుకోదగ్గ మూవీ ఏం లేదు. దీంతో మూవీ లవర్స్ కన్ను ఓటీటీలపై పడింది. వీళ్లని ఎంటర్టైన్ చేసేందుకు 25 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ విషయానికొస్తే.. నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనితో పాటు 'చిన్నా', 'మార్టిన్ లూథర్ కింగ్', 800, జర హట్కే జర బచ్కే, మిషన్ రాణిగంజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేట్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 27- డిసెంబరు 3 వరకు) అమెజాన్ ప్రైమ్ షెహర్ లఖోట్ (హిందీ సిరీస్) - నవంబరు 30 క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 దూత (తెలుగు సిరీస్) - డిసెంబరు 01 నెట్‌ఫ్లిక్స్ లవ్ లైక్ ఏ K-డ్రామా (జపనీస్ సిరీస్) - నవంబరు 28 ఒన్మ్యోజీ (జపనీస్ సిరీస్) - నవంబరు 28 అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 29 బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 29 ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 30 హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబరు 30 ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 ద బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 30 వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 01 మే డిసెంబరు (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) - డిసెంబరు 01 స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 01 ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 28 ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 01 ద షెపార్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 సోనీ లివ్ మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) - నవంబరు 29 జియో సినిమా 800 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబరు 02 బుక్ మై షో బ్యాక్ ఆన్ ద స్ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28 (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) -
ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!
ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎమోషనల్ 'చిన్నా' సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి. సంపూ డిఫరెంట్ సినిమా లాక్డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చే సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కాబట్టి వాటి గురించి కాసేపు అలా పక్కనబెట్టేద్దాం. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఆసక్తి రేపుతున్నవన్నీ కూడా డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) ఈ శుక్రవారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. చిన్నా, కన్నూరు స్క్వాడ్, ఘోస్ట్ లాంటి డబ్బింగ్ బొమ్మలతో పాటు జెట్టీ, జోతి సినిమాలతో పాటు 'ఫ్లవర్ ఆఫ్ ఈవిల్' అనే ఓ కొరియన్ సిరీస్.. తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఆయా ఓటీటీల్లో ఏయే సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (నవంబరు 17th) అమెజాన్ ప్రైమ్ బాయ్స్ 4 - మరాఠీ సినిమా మాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రం ట్విన్ లవ్ - ఇంగ్లీష్ సిరీస్ బుదాక్ ఫ్లాట్ - మలేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) బిహ్తెర్ - టర్కిష్ ఫిల్మ్ (స్ట్రీమింగ్) కంగ్రాట్స్ మై ఎక్స్ - థాయ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద వానిషింగ్ ట్రయాంగిల్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కన్నూర్ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం చిన్నా - తెలుగు డబ్బింగ్ మూవీ డ్యాషింగ్ త్రూ ద స్నో - ఇంగ్లీష్ సినిమా షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ - ఇంగ్లీష్ చిత్రం జీ5 ఘోస్ట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం బ్యాడ్ బాయ్ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఆల్ టైమ్ హై - ఫ్రెంచ్ సినిమా బిలీవర్ 2 -కొరియన్ మూవీ కోకోమెలన్ లేన్ - ఇంగ్లీష్ సిరీస్ రస్టిన్ - ఇంగ్లీష్ సినిమా స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్ సీ యూ ఆన్ వీనస్ - ఇంగ్లీష్ మూవీ సుఖీ - హిందీ సినిమా ద డాడ్స్ - ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ద క్వీన్స్ టౌన్ కింగ్స్ - ఇంగ్లీష్ మూవీ ద రైల్వే మెన్ - హిందీ సిరీస్ వి ఫర్ వెంజెన్స్ - ఇంగ్లీష్ ఫిల్మ్ ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ - జపనీస్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) బెస్ట్ క్రిస్మస్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ఆహా జెట్టీ - తెలుగు సినిమా జోతి - తమిళ మూవీ ఈ-విన్ ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో డౌన్ లో - ఇంగ్లీష్ మూవీ టి.ఐ.ఎమ్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement