సంజయ్‌ అనారోగ్యం నన్ను కలచివేస్తోంది: మెగాస్టార్‌

12 Aug, 2020 21:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలీవుడ్ సీనీయర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 3వ స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. ఆనంతరం ఆయన నిన్న ముంబై ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన ఈ వ్యాధి నుంచి బయటపడాలని ఆశిస్తూ సోషల్‌ మీడియాలో వేదికగా వ్యక్తం చేస్తున్నారు.  అదే విధంగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై చలిస్తూ ట్వీట్‌ చేశాడు. (చదవండి: సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై స్పందించిన మాన్యత)

‘‘డియర్‌ సంజయ్‌ భాయ్‌... మీరు ఇంతటి అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. కానీ మీరు ఓ ఫైటర్‌. ఎన్నో ఏళ్లుగా  అనేక ఓడిదుడుగులను చుశారు. వాటిని మీరు అధిగమించారు కూడా. అలాగే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కూడా త్వరలో కోలుకుంటారనండంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యాధి నుంచి కూడా తప్పక బయటపడతారని ఆశిస్తున్నాను. మీరు త్వరలో కోలుకోని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ మెగాస్టార్‌ ట్వీట్‌ చేశాడు. (చదవండి: సంజయ్‌దత్‌కు క్యాన్సర్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా