క్రికెట్‌ నేపథ్యంలో హిట్‌ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు

19 Nov, 2023 13:07 IST|Sakshi

వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్‌ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్‌ దశలో పరాజయమే లేకుండా  విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్‌ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్‌ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా నేటి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్‌ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు.

సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 
2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'    అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వం వహించారు.  భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు.  200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా  రవి భాగ్‌చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది.

MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 
2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ,  అనుపమ్ ఖేర్ నటించారు.

ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు.

800  ముత్తయ్య మురళీధరన్
2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్‌ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.  టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్‌ కానుంది.

'ఆజార్‌'
2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్‌' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్‌లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్‌ జీవితంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే

 నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
 ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్‌)
 ► కౌస‌ల్య కృష్ణ‌మూర్తి (సన్‌నెక్ట్స్‌)
 ► విజయ్‌ దేవరకొండ 'డియ‌ర్ కామ్రేడ్' (అమెజాన్‌,డిస్నీ హాట్‌స్టార్‌)
 ► నాగ‌చైత‌న్య 'మ‌జిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో)
 ► వెంక‌టేష్ 'వ‌సంతం'  (డిస్నీ హాట్‌స్టార్‌)
 ► లగాన్‌ హిందీ (నెట్‌ఫ్లిక్స్‌)

మరిన్ని వార్తలు