నాన్న కోసం దోశ వేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్‌

5 May, 2021 15:53 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత నెల 28న కోవిడ్‌ బారిన పడిన ఆయన.. ఇంట్లోనే ఓ స్పెషల్‌ రూంలో ఉంటున్నారు. తాజాగా ఆయన తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటునానని వెల్లడించాడు. తన ఆరోగ్యం బాగుందని, ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని తెలిపాడు.

ఇదిలా ఉంటే షూటింగ్‌లతో బీజీబిజీగా ఉండే బన్నీ.. కరోనా వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో కొడుకు అయాన్‌, కూతురి అర్హలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. నేరుగా వాళ్లని కలుసుకోన్నప్పటికీ.. వారి అల్లరిని, చిలిపి పనులను దూరం నుంచి చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆ వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుటున్నాడు.

గతంలో అల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అర్హ దోశ స్టెప్పు వీడియో ఎంత ఫేమస్‌ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా అర్హ పాప నాన్న కోసం స్వయంగా దోశ వేసి పెట్టింది. ‘నాన్నకి అర్హ స్పెషల్‌ దోశ. దోశ స్టెప్పుని ఆదర్శంగా తీసుకొనే ఇలా వేసిందేమో. నా జీవితంలో ఇది మర్చిపోలేని దోశ’ అంటూ ఆ వీడియోని షేర్‌ చేశాడు బన్నీ. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు.. తండ్రి కూతురు సో క్యూట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు