వారి రుణం తీర్చుకోలేను : సుడిగాలి సుధీర్‌

9 Nov, 2023 10:25 IST|Sakshi

‘‘నేనీ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోలు చేసినా, సినిమాలు చేసినా నా ఫ్యాన్స్‌ సపోర్ట్‌ చేశారు.. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే ‘కాలింగ్‌ సహస్ర’ సినిమాతో థియేటర్స్‌లో సందడి చేస్తాం’’అని హీరో సుధీర్‌ అన్నారు. అరుణ్‌ విక్కీరాలా దర్శకత్వంలో సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’.

షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌పై విజేష్‌ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. మోహిత్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనుల నీరు రాలదే..’ అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘మోహిత్‌ మంచి సంగీతాన్ని అందించారు. జిత్తు మాస్టర్‌ ఈ పాటని చక్కగా కొరియోగ్రఫీ చేశారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్‌ తయల్‌. ‘‘కాలింగ్‌ సహస్ర’ తర్వాత సుధీర్‌ సూపర్‌ స్టార్‌ అవుతాడు’’ అన్నారు అరుణ్‌ విక్కీరాల. ఈ కార్యక్రమంలో డాలీషా, కెమెరామేన్‌ శశికిరణ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మోహిత్, నిర్మాత బెక్కెం వేణుగో΄ాల్, రామచంద్రరావు మాట్లాడారు.

మరిన్ని వార్తలు