‘పుష్ప’రాజ్‌కి సైబరాబాద్‌ పోలీసుల సూటి ప్రశ్న.. నెట్టింట ట్వీట్‌ వైరల్‌

18 Dec, 2021 12:40 IST|Sakshi

సోషల్‌ మీడియాను వాడుకోవడంలో సైబరాబాద్‌ పోలీసలు ఎప్పుడూ ముందుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను ఉపయోగించి సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు మంచి సందేశాలను అందిస్తుంటారు. మరీ ముఖ్యంగా టాప్‌ హీరోల సినిమాలు, డైలాగ్స్‌ని తమకు అనుగుణంగా మార్చుకొని ట్రాఫిక్‌ నియమాలపై జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమాను కూడా వాడేశారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌లో తెరకెక్కిన పుష్ప మూవీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
(చదవండి: పుష్ప’మూవీ రివ్యూ)

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని బన్నీ పోస్టర్‌తో సైబరాబాద్‌ పోలీసులు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. బుల్లెట్‌ బండిపై స్టైలిష్‌గా కూర్చున్న బన్నీ ఫోటోను సైబరాబాద్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. పుష్ప విలన్‌ ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను ఫిక్స్ చేయండి. సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 
(చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ)

గతంలో సింహా సినిమాలోని ఓ డైలాగ్ వాడుకుని.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌  ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్ విడుదలైనపుడు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. హెల్మెట్స్ ఎక్కడా అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టులు పెట్టారు సైబరాబాద్ పోలీసులు.

మరిన్ని వార్తలు