వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి: దర్శక-నిర్మాత

16 Jun, 2022 18:14 IST|Sakshi

Dadasaheb Phalke School Of Film Studies Completed 5 Years: "ఎవరైనా పిల్లలు... నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను" అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు.. "నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటాను" అంటే మాత్రం గాభరాపడతారు. ''తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి" అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, "దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి. సివిల్ సర్వెంట్స్ కి, డాక్టర్స్, లాయర్స్ కి తీసిపోని గౌరవమర్యాదలు.. సినిమా రంగంలో రాణిస్తున్నవారికి దక్కుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. 

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలై... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" అత్యంత విజయవంతంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకుని, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మధు మహంకాళి ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఏకైక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తమదేనని మహంకాళి పేర్కొన్నారు.

"దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్'లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి కోర్సులు సైతం ఉండడం తమ ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత అని మధు వివరించారు. ఇప్పటివరకు తమ ఫిల్మ్ స్కూల్ లో కోర్సులు చేసినవారంతా.. ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా తమ ఫిల్మ్ స్కూల్ సిలబస్ డిజైన్ చేశామన్నారు. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి.. వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి.. తమ ఫిల్మ్ స్కూల్ బోధనను పొందుపరిచామన్నారు. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు... అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు