కొత్తిల్లు కొన్న దేత్తడి హారిక.. గృహప్రవేశ వేడుకలో దీప్తి సునయన, కాజల్‌ సందడి

30 Nov, 2023 15:28 IST|Sakshi

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే రేపటి స్టార్లు.. ఈ మాటను ఎప్పుడో రుజువు చేసి చూపించింది దేత్తడి హారిక అలియాస్‌ అలేఖ్య హారిక. సాంగ్‌ ఆల్బమ్స్‌, రీల్స్‌ చేస్తూ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేసే ఈ బ్యూటీ పలు షార్ట్‌ ఫిలింస్‌, యూట్యూబ్‌ వెబ్‌ సిరీస్‌లు చేసింది. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో టాప్‌ 5 వరకు చేరుకుని తన సత్తా చూపించింది.

సినిమాల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే తను త్వరలోనే హీరోయిన్‌గానూ వెండితెరపై కనిపించనుంది. బేబి ఫేమ్‌ సాయి రాజేశ్‌ డైరెక్షన్‌లో సంతోష​, హారిక హీరోహీరోయిన్లుగా నిస్తున్నారు. మొత్తానికి చాలాకాలానికి హారిక పంట పండిందని అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది దేత్తడి పాప.

తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు కొత్తింటి కల సాకారమైనందుకు సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంటికి వచ్చినవారిని వట్టి చేతులతో పంపించకుండా బహుమతులు కూడా అందించింది. 

చదవండి: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్‌

మరిన్ని వార్తలు