పటికతో ఇలా చేస్తే.. అవాంఛిత రోమాలు మాయం!

30 Nov, 2023 15:35 IST|Sakshi

ఓ పక్క అవాంఛిత రోమాలతో ముఖం రంగు తగ్గి అసహ్యంగా ఇబ్బందిగా ఉందా?. బయటకు వెళ్లాలన్నా భయపడుతున్నారా? . అలాంటప్పుడూ చక్కటి ఈ హోం రెమిడీలు ఫాలో అయితే సులభంగా సమస్య నుంచి బయటపడొచ్చు. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉండవు. 

  • రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్‌ లేదా గ్లిజరిన్, అలోవెరా జెల్, కొబ్బరి నూనె... వీటిలో ఏదైనా ఒకటి రాసి పది నిమిషాలు మర్దన చేయాలి. తరువాత లైట్‌ ఆపేసి పది నిమిషాలు శ్వాస మీద దృష్టి కేంద్రీకరించాలి. రోజూ ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ అంది రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా ముఖం మెరుపులీనడమే గాక, చర్మం రంగు కూడా అందంగా మారుతుంది.
  • రెండు టేబుల్‌ స్పూన్ల పటికపొడిలో టీస్పూను పసుపు, అర టీ స్పూను నిమ్మరసం, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపైన పూతలా వేయాలి. పూర్తిగా ఆరిన తరువాత వేళ్లతో సర్కిల్స్‌లా ఐదు నిమిషాలు రుద్దిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు రాలిపోతాయి. 

(చదవండి: ఐస్‌వాటర్‌ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!)

మరిన్ని వార్తలు